ఈ బ్రేక్ లో నా స్కిల్స్ కు పదును పెడతా

ఈ బ్రేక్ లో నా స్కిల్స్ కు పదును పెడతా

న్యూఢిల్లీఅనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్​ను.. తన స్కిల్స్‌‌‌‌‌‌‌‌ను షార్ప్​ చేసుకునేందుకు ఉపయోగించుకుంటానని టీమిండియా బ్యాట్స్​మన్​ హనుమ విహారి అన్నాడు. రాబోయే ఆస్ర్టేలియా  టూర్​లో రాణించేందుకు ఇది బాగా యూజ్ అవుతుందన్నాడు. ‘నిజంగా చెప్పాలంటే ఈ విరామం మాకు ఓ వరంలాగా వచ్చింది. ఈ ఖాళీ సమయంలో నా ఫిట్​నెస్​ను మరింత మెరుగుపర్చుకుంటా. అలాగే నాలోని స్కిల్స్​కు  పదును పెట్టుకుంటా. కౌంటీ క్రికెట్​, ఆసీస్​ టూర్​కు ఇవి ఉపయోగపడతాయి. పాజిటివ్​గా ఆలోచించడంతో పాటు, బిజీగా ఉండేందుకు మానసికంగా చాలా కష్టపడుతన్నా. రాబోయే మూడు నాలుగు నెలలు క్రికెట్​ ఉండదు. దీనిని ఎదుర్కోవడం కూడా నా ముందున్న పెద్ద సవాలు. ఆగస్ట్​ చివర్లో కౌంటీ క్రికెట్​ ఆడతా. ఇంగ్లిష్​ కౌంటీ టీమ్​తో నాకు ఒప్పందం కూడా ఉంది. ప్రస్తుతానికైతే దీనిపైనే ఎక్కువగా దృష్టిపెట్టా. అయినా అది జరుగుతుందో లేదో కచ్చితంగా తెలియదు. ఏదేమైనా ప్రతి రోజు ఏదో ఓపనితో బిజీగా గడిపేలా ప్లాన్స్​ వేసుకుంటున్నా’ అని విహారి పేర్కొన్నాడు. ఈ ఏడాది చివర్లో ఇండియా.. ఆసీస్​లో పర్యటించనుంది.

ఇలా కలిసొచ్చింది..

ఈ బ్రేక్​ వల్ల తనకు మరో లాభం జరుగుతోందని విహారి చెప్పాడు. ‘మే 19 నా పెళ్లి రోజు. ఈసారి తప్పకుండా నా భార్యతో కలిసి నా మొదటి పెళ్లి రోజును జరుపుకునే చాన్స్​ దక్కింది. బిజీ క్రికెట్ షెడ్యూల్​ వల్ల సాధ్యమవుతుందో  లేదోనని అనుకున్నా. కానీ ఈసారి కలిసొచ్చింది. కనీసం ఒక్క వ్యక్తి అయినా నాపై ఫిర్యాదు చేయకుండా ఉంటుంది. ఇది సంతోషించాల్సిన అంశం’ అని ఈ తెలుగు కుర్రాడు వెల్లడించాడు. ఇంట్లో పెద్దగా పని ఉండకపోవడం వల్ల రిపీటెడ్​గా 2005 యాషెస్​ సిరీస్ క్లిప్పింగ్స్​ను చూస్తుంటానన్నాడు. ఈ బ్రేక్​ వల్ల కొన్ని వాస్తవిక విషయాలు తెలుసుకుంటున్నానని చెప్పాడు. ‘కరోనా మహమ్మారి వల్ల ఈ బ్రేక్​ రావడం చాలా ఇబ్బందిగా ఉన్నా.. కొన్ని విషయాలు మాత్రం తెలిసొచ్చాయి. అందరిలాగా నేను బయటకు వెళ్లలేను. ఫ్రెండ్స్​ను కలవలేను. వాళ్లతో కలిసి తిరగలేను. కలిసినా ఓ గంట స్పెండ్​ చేస్తాం. తర్వాత ఇంట్లో ఐసోలేట్​ కావాల్సిందే. అందుకే బోర్​ కొట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా. అందులో భాగంగా యాషెస్​ వీడియోలను చూస్తా. 2005 సిరీస్​ నా ఫేవరెట్​. ఎన్నిసార్లు చూశానో నాకే లెక్క  తెలియదు. ఇప్పుడు యోగా చేయాలని కూడా ప్లాన్​ చేసుకుంటున్నా. ఏడాది నుంచి అనుకుంటున్నా, ఇప్పుడు టైమ్​ దొరికింది’

డాక్టర్ చిట్టీ ఉంటేనే మందు