హైదరాబాద్:ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జంట శలాశయాలైన ఉస్మాన్ సాగర్( గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి.. నిండు కుండను తలపిస్తున్నాయి.
శనివారం (సెప్టెంబర్ 7, 23024) సాయంత్రం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని దిగువకు విడుదల చేశారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బండ్లగూడ కార్పొరేషన్ చైర్మన్ లతా ప్రేమ్ గౌడ్, జలమండలి అధికారులు.
ముందు జాగ్రత్తలో భాగంగా ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటును ఒక ఫీటు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.. ఏదైన సాయం కావాలంటే మున్సిపల్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు.
హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1761.10 అడుగులకు చేరింది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 2.970 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 2.455 టీఎంసీలుగా ఉంది.
ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 1787.95 అడుగులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 3.430 టీఎంసీలుగా ఉంది.
ఎగువ ప్రాంతాలను భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. ఈ రెండు రిజర్వాయర్లనుంచి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.. శనివారం సాయంత్రం దిగువకు నీటిని వదలనున్నట్లు సమాచారం.. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.