ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఓపెన్

ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఓపెన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్ సైతం ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరింది. ఈ రిజర్వాయర్​ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,790 అడుగులు కాగా బుధవారం 1,788.60 అడుగులకు నీరు చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి మూసిలోకి నీటిని వదులుతున్నారు.

ప్రస్తుతం 1,200 క్యూసెక్కులు ఇన్​ఫ్లో, 220 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. మరోవైపు హిమాయత్ సాగర్​లోకి కూడా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ జలాశయం ఒక గేట్ ను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 1,600 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1,017 క్యూసెక్కులు ఉంది.