
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) కాంబోలో వస్తోన్న “ఉస్తాద్ భగత్ సింగ్(Usthad bhagathsingh)” నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత ఈ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో.. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక మరోసారి ఈ సినిమాలో పోలీస్ పాత్రలో తన పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా విడుదల చేసిన పవన్ లుక్ కు ప్రేక్షకుల్లో భారీ స్పందన వచ్చింది. ఆ హైప్ ని అలాగే మెయిన్ టైన్ చేస్తూ.. దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఫస్ట్ గ్లిప్స్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
గబ్బర్ సింగ్ రిలీజ్ కి ముందు రిలీజ్ చేసిన "నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది” అనే డైలాగ్ టీజర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ తరహాలోనే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక గబ్బర్ సింగ్ రిలీజ్అయిన మే 11న ఈ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారట. మరి ఈ గ్లింప్స్ ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి. పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు .