వరంగల్ లో ఉల్లాసంగా ఉత్కర్ష హెల్త్ రన్

వరంగల్ లో ఉల్లాసంగా ఉత్కర్ష హెల్త్ రన్

గ్రేటర్​ వరంగల్, వెలుగు: వరంగల్​ కాకతీయ మెడికల్ కాలేజ్ వార్షిక ఉత్సవం ఉత్కర్ష - 2025 హెల్త్ రన్ ఆదివారం సాయంత్రం నిర్వహించారు. మహిళల ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు ఈ హెల్త్ రన్‌ను వరంగల్ కేఎంసీ మెయిన్ గేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.క్టర్​ సంధ్య సుంకరనేని హాజరై జెండా ఊపి ప్రారంభించారు. 

కార్యక్రమంలో అధ్యాపకులు, ఐఎంఏ సభ్యులు, వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హెల్త్ రన్ అనంతరం పబ్లిక్ గార్డెన్ చౌరస్తాలో విద్యార్థులు స్కిట్స్, డ్యాన్స్ ప్రదర్శనల ద్వారా మహిళా ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మధ్యాహ్నం క్విజ్, పెయింటింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం వైద్య విద్యార్థులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించారు. అనంతరం డ్యాన్స్ ప్రదర్శనలు సందడి చేశాయి. కార్యక్రమంలో కేఎంసీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.