
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల మ్యానిపెస్టో, విజన్ డాక్యుమెంట్ ను ప్రకటించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియా వేదికగా గురువారం గాంధీ భవన్ లో తమ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో, ఎల్లుండి నియోజకవర్గాల్లో మ్యానిపెస్టో విడుదల చేస్తామని చెప్పారు. రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014,2018 లలో ఎన్నికైన కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవేవీ ఇవ్వలేదన్నారు ఉత్తమ్. దళితులకు మూడు ఎకరాల భూమి,రైతు బంధు, రైతు రుణమాఫీ ఇలా ఇచ్చిన హామీని ఏది చేయలేదని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేసి, TRS ను చిత్తు చిత్తు గా ఓడించాలని అన్నారు ఉత్తమ్.