ప్రాణాలకు తెగించి భట్టి విక్రమార్క దీక్ష చేశాడు: ఉత్తమ్

ప్రాణాలకు తెగించి భట్టి విక్రమార్క దీక్ష చేశాడు: ఉత్తమ్

ప్రాణాలకు తెగించి భట్టి విక్రమార్క దీక్ష చేశారని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. విక్రమార్కతో దీక్ష విరమింప చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్యేల కొనుగోలు చేశారని ఉత్తమ్ అన్నారు. ఈ విషయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహారించారని చెప్పారు.

పిరాయింపు ఎమ్మెల్యేలపై రేపు కోర్టులో కేసు విచారణకు రానుందని చెప్పారు ఉత్తమ్. ఈ విషయంలో రాష్ట్రపతిని కలువనున్నట్లు తెలిపారు. MIM పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనున్నట్లు తమదగ్గర సమాచారం ఉందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన MIM పార్టీకి ఎలా ప్రతాపక్ష హోదా ఇస్తారో కేసీఆర్ ప్రజలకు తెలపాలని అన్నారు ఉత్తమ్.