
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నేతల వ్యాఖ్యలు కించపరిచే విధంగా ఉన్నాయన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కశ్మీర్ విభజన సందర్భంగా ఏపీ పునర్విభజన అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావించారని గుర్తు చేశారు. తెలంగాణ ఇవ్వడం బీజేపీ నేతలకు ఇష్టం లేదన్నారు ఉత్తమ్. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లను ముస్లింలు, బీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు ఉత్తమ్.
మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు స్పీడప్ చేసింది కాంగ్రెస్. హైద్రాబాద్ గాంధీభవన్లో మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు నేతలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీమ్ అహ్మద్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీ చంద్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మీటింగ్ కు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మున్సిపాలిటీల్లో ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు 50 శాతం టికెట్లు ఇస్తామన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ , వాడవాడలా జెండా కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు నేతలు. మున్సిపాలిటీల్లో పార్టీ తరపున మరిన్ని కార్యక్రమలు చేపట్టాలి డిసైడయ్యారు పీసీసీ లీడర్స్.