కేటీఆర్ అక్రమాలకు మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం

కేటీఆర్ అక్రమాలకు మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం

కేటీఆర్ అక్రమాలకు నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు 25వ తేదీ వరకే జరగాలని నిబంధనలు ఉన్నాయి. కానీ, టీఆర్ఎస్ మాత్రం ఈ రోజు నేరేడుచర్ల మున్సిపల్ సభ్యులుగా ఎమ్యెల్సీ సుభాష్ రెడ్డి పేరు నమోదు చేయిస్తుందని ఆయన అన్నారు. ఇది అక్రమం మరియు నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఉత్తమ్ అన్నారు.

‘సోమవారం నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారాన్ని ప్రారంభించారు. ఇద్దరు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. అప్పుడు ఎమ్యెల్యే వచ్చి గొడవ చేసి ఎన్నికను వాయిదా వేయించారు. ఈ రోజు కొత్తగా టీఆర్ఎస్‌కు చెందిన వారిని సభ్యులుగా నమోదు చేయిస్తున్నారు. ఇది ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట. ఈ నెల 25వ తేదీ లోపు ఎక్స్ అఫిషియో సభ్యుల పేర్లు నమోదు చేయించాలని స్వయంగా మున్సిపల్ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ నాకు చెప్పారు. మరి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై కొంత జరిగిన తర్వాత కొత్త సభ్యుల నమోదు ఏంటి? ఇంత దారుణ అక్రమాలు ఉంటాయా? ఇలా అయితే ఇక ఎన్నికలు ఎందుకు. కేటీఆర్ ఇంట్లో కూర్చుని వారికి నచ్చిన వారి పేర్లు రాసుకుంటే సరిపోతుంది కదా. రాష్ట్రంలో కేటీఆర్ అక్రమాలు శ్రుతి మించిపోయాయి. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, ప్రజలు గమనించి అర్థం చేసుకోవాలి’ అని ఆయన అన్నారు.

For More News..

జాబ్ కన్నా.. బిజినెస్ బెటర్ అంటున్న యువతులు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

మంత్రి బైకెక్కిన హీరోయిన్