ఆటోను ఢీ కొన్న లారీ..ఐదుగురు మృతి

ఆటోను ఢీ కొన్న లారీ..ఐదుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ను.. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న చిత్రకూట్ పోలీసులు డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం షిప్ట్ చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు.