గ్యాంగ్​స్టర్ అతీక్ జాగలో పేదలకు ఇండ్లు

గ్యాంగ్​స్టర్ అతీక్ జాగలో పేదలకు ఇండ్లు
  • లబ్ధిదారులకు తాళాలు అందజేసిన సీఎం యోగి

న్యూఢిల్లీ: దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్​స్టర్ అతీక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం 76 ఫ్లాట్లను నిర్మించింది. ఆ ఇండ్ల తాళాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం పేదలకు అందజేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఈ సింగిల్ బెడ్రూం ఇండ్లకు.. లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పేదల స్థలాలను వ్యాపారులు, మాఫియా డాన్​లు లాక్కునేవారు. 

అలా కబ్జాలకు, ఆక్రమణలకు గురైన జాగల్లోనే మేము ఇప్పుడు ఇండ్లు కట్టి మళ్లీ పేదలకు పంచుతున్నం. ఇదొక పెద్ద విజయం”అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 100కు పైగా క్రిమినల్ కేసులలో దోషులుగా జైల్లో ఉన్న అతీక్ అహ్మద్​, అతని సోదరుడు అష్రఫ్​ అహ్మద్​ను ఈ ఏడాది ఏప్రిల్​లో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా దుండగులు కాల్చి చంపేశారు.