కాసేపట్లో పెళ్లి.. అనూహ్య నిర్ణయం తీసుకున్న వధువు, ఎందుకో తెలుసా ? 

V6 Velugu Posted on May 14, 2022

ప్రతి ఆడపిల్లకు పెళ్లంటే జీవితంలో ఒక మధురమైన ఘట్టం. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోవాలని వధూవరులు కోరుకుంటుంటారు. అయితే.. పెళ్లిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివిధ కారణాలతో వివాహాలు నిలిచిపోతాయి. తాజాగా.. కాసేపట్లో వరుడు తాళి కడుతాడని అనుకున్న క్రమంలో.. తనకు పెళ్లి వద్దని వధువు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు కారణం ఏంటా ? అని ఆరా తీశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ప్రతాప్ గఢ్ జిల్లాలోని పూరే భయ్యా గ్రామంలో ఓ వివాహం జరుగుతోంది. అయోధ్యకు చెందిన పునీత్ కుమార్ తో తన కూతురిని వివాహం జరిపించేందుకు ఓ వ్యక్తి నిర్ణయించాడని ప్రతాప్ గఢ్ పోలీసులు తెలిపారు. పెళ్లి వేడుకకు వధువు తండ్రి అన్ని ఏర్పాట్లు చేశారని, ఇరు కుటుంబసభ్యులు వివాహ మండపానికి చేరుకున్నట్లు, ఈ క్రమంలో.. వరుడు మద్యం సేవించి ఉన్నాడని వధువు, ఆమె కుటుంబసభ్యులు గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే 22 ఏళ్ల వధువు తనకు ఈ వివాహం వద్దని కుటుంబసభ్యులకు చెప్పినట్లు పేర్కొన్నారు.

అయితే.. వివాహం సందర్బంగా ఇచ్చిన నగదు, ఇతర వస్తువులను ఇచ్చేయాలని వధువు ఫ్యామిలీ డిమాండ్ చేసిందని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు తాము ప్రయత్నాలు చేయడం జరిగిందని,  బహుమతిగా ఇచ్చిన వస్తువులతో పాటు రూ. 3 లక్షల నగదును తిరిగిస్తామని వరుడి కుటుంబం అంగీకరించిందని తెలిపారు. వరుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సబ్ ఇన్స్ పెక్టర్ ఉమేశ్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం :
త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ను ప్రారంభించిన అమిత్ షా

Tagged , Bride cancels wedding, groom arrives drunk, marriage in UP’s Pratapgarh, Uttar Pradesh News, Poore Bhai village

Latest Videos

Subscribe Now

More News