ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలో నవంబర్ 4న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మృతి చెందగా.. మరో 25 మంది గాయాలయ్యాయి. బస్సు గర్వాల్ నుంచి కుమావోన్‌కు వెళ్తుండగా మార్చులా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో 15 చనిపోయారని .. బస్సు 200 మీటర్ల లోతులో పడిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నందున మరణాల సంఖ్య పెరగవచ్చని చెప్పారు.
మరో వైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
#WATCH | Uttarakhand: A Garwal Motors Users' bus fell into a gorge near Kupi in Ramnagar at Pauri-Almora border. Deaths and injuries feared. Search and rescue operation underway. Details awaited.
— ANI (@ANI) November 4, 2024
(Video: SDRF) pic.twitter.com/dzSgKw6tkF