- ఉత్తరాఖండ్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం
- లింగ సమానత్వం, సాధికారతే లక్ష్యమని సర్కారు వెల్లడి
డెహ్రాడూన్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో విద్యార్థినులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్రంగా దేశంలోని ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో నిలిచింది. విద్యా సంస్థల్లో లింగ సమానత్వం కల్పించేందుకు, నాయకత్వ బాధ్యతలు తీసుకునేలా విద్యార్థినులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తరాఖండ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి ధాన్ సింగ్ రావత్.. మీడియాకు తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో గణనీయమైన మార్పులు వస్తాయని, విద్యార్థి రాజకీయాల్లో విద్యార్థినుల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో విద్యార్థినులకు 50 శాతం ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లకు ఆదేశాలు జారీచేశాం. అంతేకాకుండా.. విద్యార్థి ఎన్నికల్లో మెరిట్, ప్రతిభావంత విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూస్తాం. దీంతో అన్ని కాలేజీలు, వర్సిటీల్లో అకాడమిక్ ఎక్స్ లెన్స్ పెరగడానికి మార్గం ఏర్పడుతుంది.
