ఉత్తరాఖండ్​లో యూనిఫామ్ సివిల్ కోడ్

ఉత్తరాఖండ్​లో యూనిఫామ్ సివిల్ కోడ్

డెహ్రాడూన్: అన్ని వర్గాల వారికీ పెండ్లి, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో ఒకే చట్టం వర్తింపచేసేలా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటుకు గురువారం రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. దేశంలో యూసీసీని అమలు చేయనున్న తొలి రాష్ట్రం తమదే కానుందన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హామీని ఇచ్చింది. కాగా, బీజేపీ పాలనలో ఉన్న గోవాలో ఇదివరకే యూసీసీ అమలులో ఉంది.