ఛార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు నిషేధం ఎత్తివేత

V6 Velugu Posted on Sep 16, 2021

చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఇవాళ(గురువారం) నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను సందర్శించే భక్తులకు కరోనా వైరస్ పాజిటివ్‌ రిపోర్టులు, రెండో డోసుల టీకా తీసుకున్న సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. కరోనా మార్గదర్శకాలను పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపింది.

చార్‌ధామ్‌ను సందర్శించేందుకు హై కోర్టు యాత్రికులను అనుమతించినప్పటికీ..ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీగా పరిమితి విధించాలని తెలిపింది. కేదార్‌నాథ్ ఆలయంలో 800 మంది భక్తులు, బద్రీనాథ్ ఆలయంలో 1200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్‌లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాని హైకోర్టు తెలిపింది. గతంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని చార్‌ధామ్‌ యాత్రకు పర్మిషన్ ఇచ్చేందుకు  హైకోర్టు నిరాకరించింది.

Tagged Uttarakhand High Court, lifts ban, Chardham Yatra, after three months

Latest Videos

Subscribe Now

More News