మూడు తులాల బంగారం కోసం ఎంత పని చేశార్రా..! ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టారు

మూడు తులాల బంగారం కోసం ఎంత పని చేశార్రా..! ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టారు

నల్గగొండ: నల్లగొండ జిల్లా హాలియాలో  రెండు రోజుల క్రితం వృద్ధురాలి దారుణ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనసూయమ్మ ( 65) అనే వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారం అపహరించుకుపోయిన దుండగులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆమెను దారుణంగా హత్య చేశారు.

అంతేకాదు.. ఘటనా స్థలంలోనే ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చివేసిన ఘటన కలకలం రేపింది. మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు కోసమే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

►ALSO READ | పాపం.. ఇంత సంతోషం ఆవిరైంది.. బెంగళూరులో విషాద ఘటన

చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. సరిగ్గా ఐదు రోజుల క్రితం.. వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. యాలాల మండలంలోని రాస్నం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు గోపాల్ రెడ్డి, కమల బైక్​పై తాండూర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, విశ్వనాథ్​పూర్ గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు బైక్​పై వచ్చి పోలీసులమని వారిని అడ్డగించి మాటల్లో పెట్టారు. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు మరో బైక్​పై వచ్చి కమల మెడలోని 5 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.