ఇక మారరా.. ఏ కాలంలో ఉన్నాం.. క్యాన్సర్ పోతుందని గంగా నదిలో ముంచిన్రు

ఇక మారరా.. ఏ కాలంలో ఉన్నాం.. క్యాన్సర్ పోతుందని గంగా నదిలో ముంచిన్రు

మూఢ నమ్మకం ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. గంగా నదిలో స్నానం చేస్తే క్యాన్సర్ వ్యాధి నయం అవుతుందని నమ్మని తల్లిదండ్రులు.. తమ ఏడేళ్ల చిన్నారిని హరిద్వార్‌లోని గంగా నదిలో ముంచారు. బాలుడు బిగ్గరగా ఏడుస్తున్నా వారు పట్టించుకోకుండా అలాగే నీళ్లల్లో ముంచుతునే ఉన్నారు. అలా ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయాడు. అదంతా చూస్తూ కూడా ఆ బాలుడి తల్లిదండ్రులు హర్ కి పౌరి ఒడ్డున మంత్రాలు పఠిస్తూనే ఉన్నారు. బాలుడి పరిస్థితిని పట్టించుకోకుండా అతని అత్త అలా గంగా నదిలో పలుమార్లు ముంచిందని అక్కడి వారు తెలిపారు.

చుట్టుపక్కలవారు మహిళను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమె వారి మాట వినలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారని హర్ కి పౌరి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ భావన కైంథోలా తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. బాలుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, అతని తల్లిదండ్రులతో ఢిల్లీలో నివసిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అతను నీటిలో మునిగి మరణించాడని, కేసు తదుపరి విచారణ జరుగుతోందన్నారు.