నాగదేవత ఆలయం కూల్చివేత వల్లే.. సొరంగం ప్రమాదం జరిగిందా..?

నాగదేవత ఆలయం కూల్చివేత వల్లే.. సొరంగం ప్రమాదం జరిగిందా..?

ఉత్తరకాశీలో నిర్మాణంలో టన్నెల్ కూలిపోయి శిథిలాల మాటున చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులు స్థితిపై మొదటిసారిగా ఓ వీడియోను రిలీజ్ చేశారు అధికారులు.. ఈ వీడియోలో కార్మికులు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికులకు 6 అంగుళా పైపులైన్ ద్వారా ఆహారం, మందులు, ఆక్సిజన్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలో టన్నెల్ కూలిపోవడంపై సిల్క్యరా గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర కాశీలోని స్థానిక దేవత బాబా భౌఖ్ నాగ్ ఆగ్రహించడం వల్లే నిర్మాణంలో ఉన్న సిల్క్యరాల సొరంగం కూలిపోయిందని, నవంబర్ 12న సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు టన్నెల్ నిర్మాణ సంస్థ బాబా బౌఖ్ నాగ్ ఆలయాన్ని కూల్చివేసిందని పేర్కొన్నారు. 

ఉత్తరఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలోని సిల్క్యారా సొరంగం ముఖద్వారా వద్ద దేవత ఆలయ నిర్మించబడింది. ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్ వెదర్ రోడ్ ప్రాజెక్టులో భాగమైన టన్నెల్ నిర్మాణంలో కొంత భాగం కొండచరియలు విరిగిపడి, కూలిపోవడానికి , శిథిలాల మాటున 41 మంది కార్మికులు చిక్కుకుపోవడానికి బాబా బౌఖ్ నాగ్ ఆగ్రహమే కారణమని గ్రామస్తులు చెప్పడం దుమారం రేపుతోంది.

మరోవైపు బాబా బౌఖ నాగ్  ఆలయ పూజారి కూడా ఈ ఘటనపై స్పందించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులను బయటకు తీసుకురాలేపోతున్నారు.. కంపెనీ అధికారులు కలగజేసుకొని బాబా బౌఖ్ నాగ్ దేవతకు క్షమాపణలు కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆలయ పూజారి గణేష్ ప్రసాద్ బిజల్వాన్ చెపుతున్నారు. 

ఇదే విషయమై సిల్క్యారా గ్రామస్తుడు మాట్లాడుతూ.. ఆలయాన్ని కూల్చివేయొద్దని నిర్మాణ సంస్థను కోరాం..  అలా చేయాల్సి వస్తే.. వేరేచోట మరొక ఆలయాన్ని నిర్మించాలని కోరాం.. కానీ కంపెనీ యాజమాన్యం తిరస్కరించిందని  తెలిపారు. ఇంతకుముందు కూడా ప్రాజెక్టు ప్రారంభ దశలో సొరంగం ఒక భాగం గుహలో ఓ ఆలయం ఉంది.. కానీ ఇప్పటికీ అక్కడే ఆలయం ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగలేదని అన్నారు.. 

పదిరోజులుగా 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి... మంగళవారం (నవంబర్ 21)న జెనీవాలోని ఇంటర్నేషన్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ కు నేతృత్వం వహిస్తున్న అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ ను రంగంలోకి దించారు. ఆర్నాల్డ్ కూడా  సొరంగం ప్రధాన ద్వారం వద్ద నిర్మించిన ఆలయంలో పూజలు నిర్వహించి పని ప్రారంభించినట్లు తెలుస్తోంది.. అయితే ఈ ఆపరేషన్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.