
బతుకమ్మ పండుగకు పట్టం కడుతూ.. వీ6 న్యూస్ ఈ ఏడాది మరో బతుకమ్మ పాటను అందిస్తోంది. పండుగ గొప్పదనం, ప్రత్యేకతను… పల్లె బతుకుతో బతుకమ్మ ఎలా ముడి పడి ఉందో వివరిస్తూ.. ప్రముఖ జానపద పాటల రచయిత గోరటి వెంకన్న ఈ పాటను రాశారు. కార్తీక్ సంగీతం అందించారు. సింధూజ శ్రీనివాసన్, నూతన మోహన్ లతో కలిసి కార్తీక్ ఈ పాటను పాడారు. పాటలోని సాహిత్యం, వీడియో సాంగ్ లింక్ లను కింద చూడొచ్చు.
పల్లవి: –
ఊరూ… ఊరే పూలడొంక
పారె వాగే సంద్రవంక
పాల జొన్నా… తేనెలొలక
పా…ల పిట్టా… వాలి కులుకా
ఓ… రివ్వు… రివ్వున తిరిగేగిరక
జామ… కొరికే రామచిలుక
నేలా… సూపులు నింగివంక
ఎగిరిదూకే… వాన జింకా…
ఓహో… హో.హో.హో
చరణం:– 1
ఈ.. ఇసుకమేటలు
ఊరుతున్న… ఆ జాలు ఊటలు
ఏటి పరుగులో అలలు ఆటలు…
నింగిలోన ఎన్నేల నవ్వులు
సెరువులోన ఆ కలువపువ్వులు
సందేవేల సిందాడె మువ్వలు
వాన ఋతువు సీమంత మాడెనే…
సెట్టు సేమలే… తేనెలూరెనే
పుట్టింనింటి ఆ పట్టు కాంతులా
పాలపుంత దిగి నేలకొచ్చెనే..
గాలి ఈల తాకి గంగ..పొంగేనే…
ఇల పూల గోపురాల
అలరించె రాగమాల
అరచేతులాట జూడా…
ఊరంత గుంపుగూడా
అలనింగి సులువరేలా..
పయనించె పండవ లీలా..
దివినుంచి నేలవైపు..తన నడకనేమో..
ఊ…ఊ…
చరణం 2:–
పొన్నంగి సెన్నంగి పూరేడు బెడగువ్వ
పల్లంకి తీతూక గొరవంకా…
రంగుపిట్టలెన్ని రాసిగవచ్చినా
పాలపిట్టకై.. పల్లె పబ్బతి పట్టే
సేమంతి, పూబంతి కామంతి రుద్రాక్ష,
గురవింద గునుగూలు అరవిందలూ…
గందాలు గుప్పేట అందాలపూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంటా…
ఓహో… హో.హో.హో.
మా… మాగాని మడులల్ల…
ఊ… ఊగేటి సేలల్ల…
పాలకుంకలంటా…
మా కంటి పాపలంటా…
నే..ల దీపకాంతులు…
పూ..ల పల్లె ఇంతులు…
మెరుపుతీగలోలే…మరి మురిపెమొంపినారే…
నేల నిండుగ..పూల పండుగా నీలికొండకే
మెరుపులద్దెనే…
పూలపల్లకి మేననెక్కి
గౌరమ్మ సెరువులో కొలువుదీరినే…
పూలవెలుగు నేలకాసి పగలాయే…
యే…
పూలెల్ల రాసులాయె..
గాలెల్ల గందమాయె..
తాలాల దరువులాయే…
తప్పెట్ల మోతలాయే…
పాటెంత ప్రాణమాయె
పల్లంత గానమాయే…
దివినేలయాకమాయే…
భువి పూలజాతరాయే…
ఓహో… హో. హో. హో.
ఇయ్యాలో.. ఇయ్యాల
ఓహో.. హో. హో. హో.
ఇయ్యాలో… ఇయ్యాలో…
పల్లవి 2:-
ఇసుకల పెట్టేను గౌరమ్మా…
ఇసుకలె పెరిగెనె గౌరమ్మా…
ఇసుకలె వసంతమాడంగా…
సూరీడా.. గౌరమ్మా…
ఇరిగిన తిరుపతి మావిళ్ళు…
పున్నా… గాంటి తాళ్ళు..
బోగలవంటి వనమూలు…
వనములు సినుకులు
గలగల పలికితే
వనమంతా కదిలే… గౌరీ…
మేడంతా కదిలే…
వనమంతా కదిలే… గౌరీ…
మేడంతా కదిలే…
వనమంతా కదిలే… గౌరీ…
మేడంతా… కదిలే…
పసుపుల పుట్టేను గౌరమ్మా…
పుసుపులె పెరిగెనె గౌరమ్మా…
పసుపులె వసంతమాడంగా…
సూరీడా… గౌరమ్మా…
ఇరిగిన తిరుపతి మావిళ్ళు…
పున్నా… గాంటి తాళ్ళు
బోగలవంటి వనమూలు…
వనములు సినుకులు
గలగల పలికితే
వనమంతా కదిలే… గౌరీ…
మేడంతా కదిలే…
వనమంతా కదిలే… గౌరీ…
మేడంతా కదిలే…
వనమంతా కదిలే… గౌరీ…
మేడంతా కదిలే…
స..
రీ…
మా…
గా… నీసా…
సానీసా…