వీ6 డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు

వీ6 డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు

ఆదిలాబాద్ జిల్లాలోని కోలాం గిరిజనులపై వీ6 ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాదీ  జెన్నిఫర్ అల్ఫోన్స్ డైరెక్షన్​ చేసిన ‘కోలాం’ డాక్యుమెంటరీకి వింధ్య ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ట్రైబల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఈ అవార్డును సోమవారం అందుకున్నారు విన్నర్ జెన్నిఫర్.

ఎంబీఏ చదివిన జెన్నిఫర్ ఎఫ్.టి.ఐ.ఐ.లో ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్స్ చేశారు. ఆమె తీసిన తొలి షార్ట్ ఫిల్మ్ ‘కచరా’కు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ చైల్డ్ యాక్టర్ కేటగిరీల్లో మూడు బంగారు నంది అవార్డులు దక్కాయి. ఏడేళ్లుగా ఫిల్మ్, డాక్యుమెంటరీ డైరెక్టర్, రైటర్ గా ఆమె అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. గతంలో నాగోబా జాతరపైనా ఆమె తీసిన డాక్యుమెంటరీకి పలు అవార్డులు వచ్చాయి.