ప్రోటీన్ అంటే జిమ్ లో ఇచ్చే పదార్థం అనే అభిప్రాయం ఈ మధ్య డెవలప్ అవుతూ వస్తోంది. కానీ ప్రోటీన్ అంటే అదికాదు. ప్రోటీన్ అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తూ, రోగనిరోధ శక్తి, జీవక్రియ పెరుగుదలలో కీలక పాత్ర పోషించేది.
అయితే చాలా మంది బాడీకి సరిపడా ప్రోటీన్ తీసుకుంటున్నామని అనుకుంటారు. ఎందుకంటే పప్పు, గుడ్డు, కొందరు నాన్ వెజ్ తింటున్నామని.. ప్రోటీన్ బాగానే తీసుకుంటున్నామని భావిస్తుంటారు. కానీ.. తీసుకునే దాంట్లో చాలా తక్కువగా బాడీకి అందుతుందనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మహిళలు, శాఖాహారులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో పాటు.. బరువు తగ్గాలనుకునే వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
ఈ 5 లక్షణాలు ఉంటే జాగ్రత్త..
1. తిన్న వెంటనే ఆకలేయడం..
తిన్న వెంటనే ఆకలి వేసినట్లు అనిపించడం గమనిస్తే మీ ఆహారంలో సరైన ప్రోటీన్ లేదనే అర్థం. డైటీషియన్ డా.అర్చన బాత్రా చెప్పిన వివరాల ప్రకారం.. తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ర్, లిమిటెడ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటే.. గ్లూకోస్ లెవెల్ లో మార్పులు వస్తుంటాయి దీంతో తిన్న వెంటనే ఆకలిగా అనిపించడం జరుగుతుంది.
2. జుట్టు రాలటం, బలహీనమైన గోర్లు, చర్మం..
వెంట్రుకలు, గోర్లు కెరాటిన్ తో తయారై ఉంటాయి. ఇది ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారంలో ప్రోటీన్ దీర్ఘకాలం పాటు తగినంతగా లేనప్పుడు, శరీరం జుట్టు, గోర్లు, చర్మానికి కాకుండా ఇతర అవసరాలకు విగియోస్తుంది. దీంతో వీటిపై ప్రభావం పడుతుంది. ఆ కారణంగానే రాలటం, బలహీనంగా ఉండటం, చర్మం డల్ గా కనిపించడం చూస్తుంటాం.
వీటిలో ఇవి ఉంటాయి:
జుట్టు రాలడం
గోళ్లు బలహీనపడటం
జుట్టు పెరుగుదల మందగించడం
చర్మం కాంతిహీనంగా మారడం.
3. అలసటగా ఉండటం:
అలసట వస్తుందంటే.. కేవలం తగినంత నిద్ర లేకపోవడం వల్ల మాత్రమే అలసట వస్తుందని కాదు. సరైన ప్రోటీన్ తీసుకోకపోవడం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. వ్యాయామం తర్వాత కండరాల నొప్పితో బాధపడేవారు, తరచుగా అలసిపోయినట్లు భావించేవారు, శక్తి తక్కువగా ఉన్నట్లు అనుభవించే వ్యక్తులు తగినంత ప్రోటీన్‌లను తీసుకోకపోవడమే కారణం కావచ్చునని చెబుతున్నారు. అదే క్రమంలో బరువు తగ్గే క్రమంలో కేలరీలు తగ్గించడం.. జరుగుతుంటుంది. కానీ శరీరంలో ఉన్న అదనపు శరీర కొవ్వును తగ్గించుకోలేకపోవడం ఒక సమస్యగా మారుతుందని అంటున్నారు.
►ALSO READ | జ్యోతిష్యం : శనివారం అమావాస్య రోజున శని భగవానుడి జయంతి.. పూజ ఎలా చేయాలి.. ఏ మంత్రం పఠించాలంటే..!
4. తక్కువ రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తి పెరగటం, ఆరోగ్యంగా ఉండటంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే యాంటీబాడీలు , రోగనిరోధక కణాలన నిర్మాణంలో ప్రోటీన్ ఉపయోగపడుతుంది.
5. అనారోగ్యానికి గురికావడం
ఎక్కువగా జలుబు చేయడం, గాయాలు వేగంగా తగ్గకపోవడం, పదేపదే వచ్చే ఇన్ఫెక్షన్లు రావడం, తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడంతో ముడిపడి ఉంటాయని చెబుతున్నారు. ఇదంతా పోషకార లోపం ఉన్నట్లుగా చెప్పవచ్చునని డాక్టర్ బాత్రా అంటున్నారు.
తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ.. రోగనిరోధక శక్తి క్రమక్రమంగా బలహీనపడవచ్చుని చెబుతున్నారు. .
ఎంత ప్రోటీన్ అవసరం?
ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ప్రతి కిలో శరీర బరువుకు సుమారు 0.8-1 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది. యాక్టివ్ గా ఉండే వ్యక్తులు, వృద్ధులు, హార్మోన్ల సమస్యలు ఉన్న మహిళలు, కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. ప్రోటీన్ పరిమాణం పెంచాల్సి ఉంటుందని చెబుతున్నారు.
రాత్రి భోజనంలో ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడానికి బదులుగా, గుడ్లు, పనీర్, గ్రీక్ యోగర్ట్, టోఫు, పప్పులు, చేపలు, చికెన్, సోయా ఉత్పత్తులు, నట్స్, విత్తనాల వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ అర్చన బాత్రా సూచిస్తున్నారు.
