V6,వెలుగు ఎఫెక్ట్: తెనుగుపల్లెకు వైద్య బృందాలు

V6,వెలుగు ఎఫెక్ట్: తెనుగుపల్లెకు వైద్య బృందాలు
  • ‘వెలుగు’ కథనానికి స్పందన

కరీంనగర్​, వెలుగు:  తెనుగుపల్లెకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం ఉదయమే తరలివెళ్లారు. మెగా హెల్త్​ క్యాంప్​ నిర్వహించారు. వెలుగు లో సోమవారం పబ్లిష్​ అయిన 'మంచం పట్టిన  తెనుగు పల్లె' వార్తతో డిపార్ట్​మెంట్​అలర్ట్​ అయ్యింది. డీఎంహెచ్ వో, మలేరియా  అధికారులతో కలిసి ఊరికి చేరుకున్నారు.  డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన  జాగ్రత్తల గురించి వివరించారు.  గ్రామంలో, నీరు నిలవ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్​చేశారు. నీటి గుంటలు, మురుగుకాల్వల్లో మందులు స్ప్రే చేశారు.  జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేశారు. డెంగ్యూ నిర్దారణకు బ్లడ్​శాంపిల్స్​ తీసుకున్నారు.  గ్రామంలో ఫాగింగ్​ చేయాలని గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించారు. పల్లెల్లో డెంగ్యూ ప్రబలకుండా  చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో జ్వరాలపై  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్లు కూడా ఆరా తీశారని, హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను పంపనున్నారని తెల్సింది.