
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో వీ6 వెలుగు ఫొటో గ్రాఫర్ మహిమల భాస్కర్ రెడ్డికి ‘ చేయూత’ కేటగిరీలో మొదటి బహుమతి దక్కింది.
ఈ పోటీలో 94 ఎంట్రీలు రాగా, అందులో 744 ఫొటోలతో పోటీ పడి భాస్కర్ రెడ్డి ఫొటోను అవార్డు వరించింది. మంగళవారం హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ , రెవెన్యూ శాఖ Aమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవార్డును అందించనున్నారు. భాస్కర్ కు రాష్ట్ర స్థాయి అవార్డు రావడంతో పలువురు ఫొటోగ్రాఫర్స్ అభినందించారు.