బంజారాల తీజ్ పండుగపై వీ6 వెలుగు స్పెషల్ సాంగ్

బంజారాల తీజ్ పండుగపై వీ6 వెలుగు స్పెషల్ సాంగ్

హైదరాబాద్: లంబాడాలుగా పిలువబడే గోర్ బంజారాలు తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. తీజ్ నేపథ్యంలో వీ6 వెలుగు ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. తీజ్ పండుగ విశేషాలు, జరుపుకునే విధానం గురించి వివరిస్తూ రూపొందించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రకృతి పండుగగా చెప్పుకునే తీజ్ ను లంబాడాలు వైభవంగా జరుకుంటారు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వర్షాకాలంలో నాట్లు పూర్తయ్యే సమయంలో ఈ ఫెస్టివల్ ను ఉల్లాసంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో జరుపుకునే తీజ్ అంటే నారు అని అర్థం. పండుగలో భాగంగా పెళ్లి కాని అమ్మాయిలు తమ అన్నదమ్ములు తోడుగా తండా నాయక్ ఇంటికి చేరుకుంటారు. నాయక్ ఇంట్లో నుంచి గోధుమలు సేకరించి, శుభ్రమైన నీటితో కడిగి వాటిని అతడి ఇంట్లోనే తొమ్మిది రోజుల పాటు భద్రపరుస్తారు. ఈ 9 రోజులు అమ్మాయిలు ఆట పాటలతో మంచి వరుడు రావాలని కోరుకుంటారు. తండాలోని పంట పొలాలు పచ్చగా ఉండాలని సంత్ సేవాలాల్ మహరాజ్ కు భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహిస్తారు.