హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జాట్) ఆధ్వర్యంలో ఆరంభమైన ఎన్‌ఈసీసీ–జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్‌లో V6 వెలుగు క్రికెట్ టీమ్ అద్భుత విజయంతో శుభారంభం చేసింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో V6 వెలుగు టీమ్ 8 వికెట్ల తేడాతో నమస్తే తెలంగాణపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన V6 వెలుగు జట్టు 17.4 ఓవర్లలో 102 రన్స్ చేసింది. సందీప్ సుంకర (35 బాల్స్‌లో 3 ఫోర్లతో 29), రాజ శేఖర్ (23 బాల్స్‌లో 4 ఫోర్లతో 23), నరేందర్ (12 నాటౌట్) రాణించారు. అనంతరం V6 వెలుగు పేసర్ శ్రీకాంత్ రెడ్డి (5/18) ఐదు వికెట్లతో సూపర్ బౌలింగ్ చేయడంతో టార్గెట్ ఛేజింగ్‌లో ప్రత్యర్థి జట్టు 15.1 ఓవర్లలో 94 రన్స్‌కే ఆలౌటైంది. స్పిన్నర్లు సందీప్ సుంకర (3/18), రాజశేఖర్ (1/16)తో పాటు సరేంద్ర భాను (1/18) తలో వికెట్ పడగొట్టి V6 వెలుగు జట్టును గెలిపించారు. జేపీఎల్ రెండో సీజన్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించిన శ్రీకాంత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
