హైదరాబాద్, వెలుగు: జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్‌ను వీ6 వెలుగు క్రికెట్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీతో షురూ చేసింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో నమస్తే తెలంగాణను ఓడించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన వీ6 వెలుగు 17.4 ఓవర్లలో 102 రన్స్ చేసింది. సందీప్ సుంకర (29), రాజ శేఖర్ (23) రాణించారు.
అనంతరం పేసర్ శ్రీకాంత్ రెడ్డి (5/18) ఐదు వికెట్లతో విజృంభించడంతో ఛేజింగ్‌లో ప్రత్యర్థి జట్టు 15.1 ఓవర్లలో 94 రన్స్‌కే ఆలౌటైంది. సందీప్ (3/18) మూడు, రాజశేఖర్ (1/16), సురేంద్ర భాను (1/18) తలో వికెట్ పడగొట్టారు. శ్రీకాంత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు పది జట్ల జెర్సీలను ఆవిష్కరించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ సంద్భరంగా 80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్, స్లైకింగ్‌లో రాణిస్తూ పతకాలు గెలుస్తున్న వెటరన్ అథ్లెట్ మర్రి లక్ష్మణ్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్పోర్టివో ఎండీ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
