లేచి పడిన కెరటం! : లాలూ శకం ముగిసినట్టేనా?

బీహార్‌‌లో లాలూ శకం ముగిసినట్టేనా?    లోక్‌‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం

పాట్నా:

లోక్‌‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌‌ (ఆర్జేడీ) ఘోరంగా ఓడిపోవడంతో  ఆపార్టీ చీఫ్‌‌  లాలూప్రసాద్‌‌  యాదవ్‌‌ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు   30 ఏళ్లకుపైగా బీహార్‌‌ రాజకీయాలను శాసిస్తున్న లాలూ తాజా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.  ఈనెల 23న  ఫలితాలు  వెలువడిన  తర్వాత రాంచీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న   లాలూ ప్రసాద్‌‌ రెండురోజులు లంచ్‌‌ చేయలేదని డాక్టర్లు చెప్పారు.  ఆర్జేడీని 1997లో  ఏర్పాటుచేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలను శాసించలేని పరిస్థితిలో ఉండడం ఆయనకు ఇదే తొలిసారి. ఆర్జేడీ ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో  బీహార్‌‌లో లాలూ శకం ముగిసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ  బెయిల్‌‌ పై బయటకు వచ్చినా..రాజకీయంగా ఆయన  పార్టీకి ఎంతవరకు పూర్వవైభవాన్ని తీసుకొస్తారన్నది అనుమానమేనని అంటున్నారు.  వయోభారం వల్ల 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనడం అనుమానమేనని  చెబుతున్నారు. ఆయనపై ఇంకా ఐదు కేసులు రాంచీ, పాట్నా సీబీఐ కోర్టుల్లో పెండింగ్‌‌లో  ఉన్నాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి ఆయన  తొందరగా బయటపడతారా అన్నది కూడా అనుమానమే అని  చెబుతున్నారు.

తేజస్వీ చేతిలో…

తండ్రి లాలూ  అందుబాటులో లేకపోవడంతో చిన్న కొడుకు తేజస్వి యాదవే పార్టీని నడిపిస్తున్నారు . అయినా ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. జైల్లో ఉంటూ పార్టీ వ్యవహారాలను మేనేజ్‌‌ చేయగలిగినా, ఎలక్షన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు దిశానిర్దేశం చేసినా, సోషల్‌‌ ఇంజినీరింగ్‌‌ వ్యూహాలను పన్నినా.. పోటీచేసిన 19 లోక్‌‌సభ సీట్లలోనూ  ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయింది. ఈసారి ఎన్నికల్లో  లాలూ మార్క్‌‌ ‘సామాజిక న్యాయం’   ఏమాత్రం  పనిచేయలేదని  విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పుడేంటి?

లాలూ జైల్లో ఉండడంతో   ఆర్జేడీకి నాయకత్వం పెద్ద  సమస్యగా మారింది.   భార్య రబ్రీ దేవి, కొడుకు తేజస్వి యాదవ్‌‌ ఎన్నికల ప్రచారంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆర్జేడీ లాలూ ఫ్యామిలీకి చెందిన ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీగా మారిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  ప్రధాన ఓటు బ్యాంక్‌‌ అయిన యాదవులు  కూడా దూరమయ్యారంటున్నారు.  మరోవైపు, యూదవుల ఓట్లు ఆర్జేడీకి పడకుండా బీజేపీ పక్కా ప్లాన్‌‌ రెడీ  చేసింది. వాళ్ల  ఓట్లు తమకు పడేలా మంత్రి నంద్‌‌ కిశోర్‌‌ యాదవ్‌‌,  బీజేపీ  రాష్ట్ర చీఫ్‌‌ నిత్యానంద్‌‌ రాయ్‌‌ సేవల్ని వినియోగించుకుంటోంది. బీహార్‌‌లో వెనుకబడిన నాలుగు తరగతుల్లో  యాదవులు  పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరోవైపు,  లోక్‌‌సభ  ఫలితాల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఆర్జేడీలో లుకలుకలు బయలుదేరాయి.  తేజస్వీ యాదవ్‌‌ అసెంబ్లీలో ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేయాలని  ఆర్జీడీ సీనియర్‌‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌‌ ప్రసాద్‌‌ డిమాండ్‌‌ చేశారు.