స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో ఖాళీలు 20 వేలేనట

స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో ఖాళీలు 20 వేలేనట
  • స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో ఖాళీలు 20 వేలే
  • ఇందులో టీచర్ పోస్టులే 14 వేలు వేకెంట్
  • లెక్కలు తీసిన టీచర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో పని చేస్తున్న టీచర్ల లెక్క తేలింది. 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తేల్చారు. ఇందులో 14 వేల టీచర్ పోస్టులుండగా, మిగతావి నాన్​టీచింగ్ పోస్టులు. ఈ లెక్కలనుఇవ్వాలో, రేపో సర్కారుకు అందించనున్నారు. 2015లో రేషనలైజేషన్ సందర్భంగా 6 వేల పోస్టులను డీఈఓ పూల్‌‌‌‌‌‌‌‌లో పెట్టారని, వాటిని ఇప్పుడు ఖాళీల్లో చూపెట్టలేదని టీచర్ల సంఘాలు చెబుతున్నాయి. 

టీచర్ల లెక్కల్లో తేడాలు
రాష్ట్రంలో 26,050 సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 22 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. అయితే కొంతకాలంగా సర్కారీ టీచర్ల లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగా పనిచేస్తున్న క్యాడర్​ను కొత్త జిల్లాలకు అలాట్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీంతో టీచర్ల పూర్తి స్థాయి లెక్కలు తీయడం తప్పనిసరి అయింది. ఈ క్రమంలో నెలరోజుల నుంచి స్కూళ్లలోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల వివరాలు తీయడం మొదలుపెట్టారు. శాంక్షన్డ్ పోస్టులు, ప్రస్తుతం వర్క్ చేస్తున్న వారి వివరాలను ఉమ్మడి, కొత్త జిల్లాల వారీగా సేకరించారు. దీంట్లోనే లోకల్ బాడీ, గవర్నమెంట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లతోపాటు క్యాడర్ వారీగా డేటాను స్కూల్ వైజ్ గా తీసుకున్నారు. రెండు సార్లు డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లు డీఈఓలతో సమావేశం నిర్వహించి, వారి డౌట్లను క్లారిఫై చేశారు. ఇవన్నీ పూర్తయ్యాక 3 రోజుల కిందట డీఈఓలు సంతకం చేసి వివరాలను అందజేశారు. 

ఉన్నది 1.10 లక్షల మంది
రాష్ట్రంలో 1.24 లక్షలకుపైగా శాంక్షన్డ్ టీచర్ పోస్టులు ఉండగా, 1.10 లక్షల మంది పనిచేస్తున్నట్టు అధికారులు లెక్కలు తీశారు. 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. నాన్ టీచింగ్ కేటగిరీలో 10 వేల దాకా శాంక్షన్డ్ పోస్టులుండగా, 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. గతంలో ఇచ్చిన జీవో ఆధారంగా ఇప్పటికే ఆయా పోస్టులను జిల్లా, జోనల్, మల్టీజోనల్ క్యాడర్ వారీగా విభజించి లెక్కలు రెడీ చేశారు. మరోవైపు 2015లో రేషనలైజేషన్ సందర్భంగా సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్ పోస్టులుగా గుర్తించి, 6 వేల టీచర్ పోస్టులను డీఈఓ పూల్‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. వాటిని ఈ ఖాళీల లెక్కల్లో చూపించలేదని టీచర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటిని చూపిస్తే 20 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉంటాయని చెప్తున్నాయి.