కరోనా రికవరీలకు 3 నెలల తర్వాతే వ్యాక్సిన్

కరోనా రికవరీలకు 3 నెలల తర్వాతే వ్యాక్సిన్

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ గడువు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారు మూడు నెలల తర్వాత టీకా తీసుకోవచ్చని మోడీ సర్కార్ తెలిపింది. అలాగే కరోనా రికవరీలకు ఫస్ట్ డోస్ ఇచ్చిన 3 నెలలకు సెకండ్ డోస్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇంతకుముందు కరోనా రికవరీలకు కొవిడ్ నెగిటివ్ గా వచ్చిన తర్వాత 45 రోజులకు టీకా ఇచ్చేవారు. అయితే తాజాగా వీటిని ప్రభుత్వం పైవిధంగా సవరించింది. నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ 19 చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ రూల్స్ తీసుకొచ్చింది. వీటిని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఆమోదించింది.