సర్పంచ్‌లు, సెక్రటరీలకు వ్యాక్సినేషన్‌‌‌‌ డ్యూటీ

V6 Velugu Posted on Jan 12, 2021

  •           ఎంపిక చేసిన వాళ్లను సెంటర్లకు చేర్చాల్సిన బాధ్యత వాళ్లదే
  •           ఆఫీసర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఎంపికైనవారిని వ్యాక్సినేషన్‌‌ సెంటర్లకు తీసుకొచ్చే బాధ్యత గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలదేనని సీఎం కేసీఆర్ అన్నారు. పోలీసులు, ఇతర భద్రతా బలగాల సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే బాధ్యతను ఎస్సైలు, స్టేషన్​ హౌజ్​ఆఫీసర్లు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతున్న నేపథ్యంలో.. హెల్త్ ఆఫీసర్లు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. వ్యాక్సినేషన్‌‌‌‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆఫీసర్లు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. 1,213 వ్యాక్సిన్ సెంటర్లు, 866 కోల్డ్ చైన్ పాయింట్స్‌‌‌‌ రెడీ చేశామని.. కేంద్రం నిర్ణయించిన కోవిషీల్డ్‌‌‌‌, కోవాగ్జిన్‌‌‌‌ వ్యాక్సిన్లను తొలుత హెల్త్, ఫ్రంట్‌‌‌‌ లైన్‌‌‌‌ వర్కర్లకు, తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, దీర్ఘకాలిక రోగులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సమీక్ష అయ్యాక కేసీఆర్​ ఆఫీసర్లతో కలిసి ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో పాల్గొన్నారు. తర్వాత అధికారులకు కేసీఆర్  సూచనలు చేశారు. సర్కారు ఆర్డర్​లో లబ్ధిదారులను వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకురావాల్సిన బాధ్యతను సర్పంచులు, సెక్రటరీలు, ఎస్సైలకు అప్పగించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ట్రీట్​మెంట్​ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ వ్యాక్సినేషన్‌‌‌‌లో పాల్గొనాలని సూచించారు.

Tagged Telangana, Vaccination, Sarpanches, duty, secretaries

Latest Videos

Subscribe Now

More News