28 నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్

V6 Velugu Posted on May 25, 2021

  • విధి విధానాలు రూపొందించిన ఆరోగ్య శాఖ

హైదరాబాద్: కరోనాను కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం జనంతో ఇంటరాక్ట్ అయ్యే వారిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ ఇస్తే కరోనా విస్తరణ తగ్గిపోతుందన్న నిపుణుల సూచనకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రతిపాదన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనాభాలో 25  లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారని అంచనా వేశారు. ప్రతిరోజు తమ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ఎక్కువగా జనంతో ఇంటరాక్ట్ అయ్యేవారిని... సూపర్ స్ప్రెడర్స్ గా పరిగణిస్తారు. వీరు వృత్తి, విధులను బట్టి 25 కేటగిరీల గ్రూప్స్ కు చెందిన వారై ఉంటారు.

ఒక్కో గ్రూప్ లో లక్ష మంది ఉంటారు. ఆటోవాలాలు, డ్రైవర్స్ సుమారు లక్ష మంది ఉంటారు.  వీరికే మొదట వ్యాక్సిన్ ప్రారంభించాలని తాజా ప్రతిపాదన. అలాగే కూరగాయలు, మటన్...చికెన్ వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్స్, ఇస్త్రీ షాపులు, కిరాణా షాపు వ్యాపారులు, డెలివరీ బాయిస్, బార్బర్ షాప్స్.. ఇలా అందరిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించారు. వీరికి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇచ్చి ఈనెల 28 నుంచి వ్యాక్సిన్లు ఇచ్చేలా ఆరోగ్యశాఖ విధి విధానాలు రూపొందించింది. 

Tagged , ts covid vaccination, telangana corona vaccination, Vaccination for super spreaders, vaccination begins 28th, ts health department latest updates

Latest Videos

Subscribe Now

More News