ముంబైలో భారీ వర్షాలు.. వ్యాక్సినేషన్ నిలిపివేత

ముంబైలో భారీ వర్షాలు.. వ్యాక్సినేషన్ నిలిపివేత

గత కొన్ని రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ముంబాయి అతలాకుతలం అవుతోంది. ఆ వర్షాల వల్ల వచ్చిన వరదల నుంచి ముంబై ఇంకా తేరుకోలేదు. చాలా ఏరియాల్లో వరద అలాగే కొనసాగుతోంది. ముంబై కండివలీలోని ఠాకూర్ కాంప్లెక్స్‌లోని BMC అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏరియాలో దాదాపు 400 కార్లు, ఆటోరిక్షాలు నీట మునిగాయి. గత 48 గంటలకు పైగా కార్లు నీటిలోనే ఉన్నాయి.  నీట మునిగిన వాహనాలను బయటకు తీసేందుకు BMC సిబ్బంది 24 గంటలుగా వాటర్ తొలగిస్తూనే ఉన్నారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ముంబైలో సాధారణ జన జీవనం పూర్తిగా దెబ్బతింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరి.. పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచి.. రోడ్లు దెబ్బతిన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు థానేలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.