మరికొద్ది రోజుల్లో వ్యాక్సినేషన్ షురూ

మరికొద్ది రోజుల్లో వ్యాక్సినేషన్ షురూ
చెన్నై: కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో కృషి చేసిన సైంటిస్టులు, డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ కృతజ్ఞతలు తెలిపారు. మరికొద్ది రోజుల్లో దేశ ప్రజలకు టీకాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ సమీక్షలో భాగంగా తమిళనాడు, చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిని హర్ష వర్దన్ సందర్శించారు. ‘టీకాను తక్కువ సమయంలో అభివృద్ధి చేయడంలో ఇండియా విజయవంతమైంది. మరికొద్ది రోజుల్లోనే దేశ ప్రజలకు వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తెస్తాం. తొలుత హెల్త్ కేర్ వర్కర్స్‌‌తోపాటు ఫ్రంట్‌‌లైన్ వర్కర్స్‌‌కు వ్యాక్సినేషన్ చేస్తాం. వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది హెల్త్ కేర్ వర్కర్స్‌‌కు ట్రెయినింగ్ ఇచ్చాం. అది ఇంకా కొనసాగుతోంది’ అని హర్ష వర్దన్ చెప్పారు.