జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరిత చిత్ర బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో జగపతిబాబు మాట్లాడుతూ ‘ఓల్డ్ మెన్– యంగ్ గర్ల్ కాన్సెప్ట్‌తో
థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాం. ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయి. అవి అందర్నీ థ్రిల్ చేస్తాయి’ అని చెప్పారు. లయ మాట్లాడుతూ ‘టీజర్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది.
నటించినప్పుడు కంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా పవర్‌ఫుల్‌గా, డెప్త్ ఉన్న సినిమాలా అనిపించింది. అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. ఫస్ట్ మూవీకే టాలెంటెడ్ యాక్టర్స్, సీనియర్ టెక్నీషియన్స్‌తో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా అని డైరెక్టర్ ఆకెళ్ల వి కృష్ణ అన్నాడు.
మంచి కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, కిషోర్ నాయుడు అన్నారు. నటి హృతిక శ్రీనివాస్, డీఓపీ చోటా కె. నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు.

