పోటీ  కాదు.. మూవీ నచ్చితేనే ఆడియన్స్ చూస్తారు : వడ్డే నవీన్  

పోటీ  కాదు.. మూవీ నచ్చితేనే ఆడియన్స్ చూస్తారు : వడ్డే నవీన్  

వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ్ నార్ల   దర్శకుడిగా పరిచయమ‌‌‌‌‌‌‌‌వుతున్నాడు.  రాశి సింగ్, శిల్పా తులస్కర్ హీరోయిన్స్.   జూన్ 19న సినిమా విడుదల కానుంది.  తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో సాధారణ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా వడ్డే నవీన్ కనిపించారు. అన్యాయాన్ని ఎదిరించినందుకు గాను తనను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేస్తుంటారు. ఓ పొలిటికల్ లీడర్ స్కామ్‌‌‌‌‌‌‌‌ను బయటపెట్టే క్రమంలో త్రిమూర్తులు ఏం చేశాడనేది కథగా రివీల్ చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు అతిథిగా హాజరైన డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘వడ్డే నవీన్ అప్పట్లో నటించిన  చిత్రానికి అసిస్టెంట్, కో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశాను. ఆ టైంలోనే  ‘ఆది’ అవకాశం వచ్చింది. నవీన్   కెరీర్‌‌‌‌‌‌‌‌లోని 90 శాతం సినిమాలు మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయలేదు. సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు. ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన చిత్రాలే చేయాలని,  ఈ  చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. 

వడ్డే నవీన్ మాట్లాడుతూ ‘ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది. ఏ  ఫ్రైడే అయినా కూడా సింగిల్‌‌‌‌‌‌‌‌గా సినిమా రాలేదు. ఒకరితో పోటీ అని కాదు.. మూవీ నచ్చితేనే ఆడియెన్స్ చూస్తారు. ఈ చిత్రాన్ని వాస్తవికతకు దగ్గరగా ఉండేలా రూపొందించాం’ అని చెప్పాడు. అందరికీ నచ్చే చిత్రమిది అని రాశి సింగ్ చెప్పింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తోపాటు మెసేజ్ ఇచ్చే సినిమా ఇదని డైరెక్టర్ కమల్ తేజ్ అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.