
హైదరాబాద్ సిటీ, వెలుగు: వడ్డెరలు ఏకతాటిపైకి వచ్చి సమస్యలపై పోరాడాలని అఖిల భారత వడ్డెర సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మంగళవారం సంఘం నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా గుంజా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా దండుగుల అశోక్, జాతీయ సంయుక్త కార్యదర్శిగా మక్కల శేఖర్, రాష్ట్ర కార్యదర్శిగా వేముల మధుసూదన్, యువజన అధ్యక్షుడిగా డాక్టర్ వేముల లోకేశ్, యువజన కార్యదర్శిగా డాక్టర్ వేముల శ్రీనివాస్ ను నియమించినట్లు తెలిపారు. పేదరికంలో మగ్గుతున్న వడ్డెరలను ఆదుకునేందుకు తమ సంఘం ముందుంటుందని చెప్పారు.