నేరడిగొండ, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని.. గెలిస్తే పొంగిపోవద్దని, ఓడితే కుంగిపోవద్దని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూర్ లో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ వడూర్ప్రీమియర్లీగ్(వీపీఎల్) ఆదివారం ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బ్లాక్ బాస్టర్స్ జట్టుపై వడూర్ రైడర్స్ విజయం సాధించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. క్రీడలు శారీరక ధృరుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడాకారులు ఎండలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విన్నింగ్ జట్టుకు రూ.20వేలు, రన్నరప్ కు రూ.10 వేలు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆడెపు శ్రీకాంత్, ఆదుముల్ల భూషణ్, అంబేకరి పండరి తదితరులు పాల్గొన్నారు.
