వాక్కాయ వండర్స్‌

వాక్కాయ వండర్స్‌

వాక్కాయ, వోగ్గాయ, కలేకాయ, కొరోండా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ పండ్లని. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్కలు సిట్రస్‌, బెర్రీ జాతికి చెందినవి. లేత గులాబీ రంగులో చూడ్డానికి  క్రాన్‌ బెర్రీలా కనిపిస్తాయి. పులుపు, వగరు టేస్ట్‌ ఉంటాయి. వీటిని పప్పులో వేసుకుంటారు. పచ్చళ్లు, జామ్‌ చేస్తారు. వీటిలో ఎక్కువగా విటమిన్‌– బి, సి, ఐరన్‌ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా పనిచేస్తుంది. అందుకే ఎన్నో ఏండ్లుగా హెర్బల్‌ మెడిసిన్‌గా వాడుతున్నారు దీన్ని.
 వాక్కాయను రోజూ తింటే...

  • వీటిలో ఉన్న ఫైబర్ వల్ల గ్యాస్‌ ట్రబుల్‌, కడుపు ఉబ్బరం, అజీర్తి తగ్గుతాయి.  పెక్టిన్ అనే కార్బోహైడ్రేట్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది.
  • వాక్కాయలో ఉన్న విటమిన్స్‌, ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌, సెరటోనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది న్యూరోట్రాన్స్​మీటర్​లా  పనిచేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి మెంటల్‌ హెల్త్‌ బాగుంటుంది.
  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న ఈ పండ్లు గాయాలు, వాపు, వాటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తుంది. 
  • గుండె కండరాలను బలంగా చేస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.  బీపీ, హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా కాపాడుతుంది.