స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గామి.. విశేషాలు

స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గామి.. విశేషాలు

దేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ ను జనవరి 23న ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత నావికాదళం ఐదవ స్కార్పెన్ - తరగతికి చెందిన ఈ జలాంతర్గామికి వాగిర్ అని నామకరణం చేశారు. దీన్ని ముంబయిలోని మజగాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఇండియన్ నేవీ ప్రాజెక్ట్- 75 కింద స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన నావల్ గ్రూప్ సహకారంతో దీన్ని  నిర్మించగా.. ఈ జలాంతర్గాముల ఉత్పత్తికి సంబంధించి ఇండియా-- ఫ్రాన్స్ మధ్య 2005లోనే ఒప్పందం కుదిరింది. నవంబర్ 12, 2020న వాగిర్ నిర్మాణం ప్రారంభం కాగా, గతేడాది ఫిబ్రవరి 1 నుంచి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆయుధ ప్రయోగాలు, సెన్సర్ ప్రయోగాలు వంటివి కూడా పూర్తయ్యాయి. కేంద్రం చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా ఈ జలాంతర్గామని దేశీయంగానే తయారు చేశారు. ఈ సబ్ మెరైన్ మన నావికా దళాన్ని మరింత బలపేతం చేస్తుంది.

భారత్ కు పెనుముప్పుగా మారిన చైనాకు పోటీగా.. తన సైనిక సామర్థాన్ని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించింది. అందులో భాగంగా దేశీయంగా జలాంతర్గాములను తయారు చేస్తూ..   జల మార్గంలో కూడా చైనాను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. దీంతో పాటు ఇండియన్ నేవీ ప్రాజెక్ట్-75లో భాగంగా ఫ్రెంచ్ కంపెనీ DCNS రూపొందించిన ఆరు కల్వరి-తరగతి జలాంతర్గాములను కూడా దేశంలో నిర్మిస్తున్నారు. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైనింగ్ లేయింగ్, ఏరియా సర్వైలెన్స్ వంటి మిషన్‌లను కూడా రూపొందించనుంది.