IPL 2026: హైదరాబాద్‎పై వైభవ్ ఊచకోత.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

IPL 2026: హైదరాబాద్‎పై వైభవ్ ఊచకోత.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఐపీఎల్ 19లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‎తో జరుగుతోన్న ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్‎లో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన మూడో ఓవర్లో వైభవ్ పిచ్చకొట్టుడు కొట్టాడు. 4, 6, 6, 6, 1లతో ఏకంగా 23 రన్స్ బాదాడు.  సాకిబ్ హుస్సేన్ వేసిన నాలుగో ఓవర్లలో వరుసగా  6, 6, 6 తో చెలరేగాడు. 

బౌలర్లపై కనికరం చూపకుండా ఊచకోత కోస్తున్నాడు. వైభవ్ విధ్వంసంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వైభవ్ (61), జైశ్వాల్ (23) ఉన్నారు. ఓపెనర్లు ఇదే దూకుడు చూపిస్తే ఆర్ఆర్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. కాగా, రాయ్‎పూర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో సన్‎రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ తొలుత బ్యాటింగ్‎కు దిగింది.