AadiKeshava First Glimpse: ఆదికేశవుడిగా వైష్ణవ్..మాస్ అవతార్లో అదరగొట్టేసాడు

AadiKeshava First Glimpse: ఆదికేశవుడిగా వైష్ణవ్..మాస్ అవతార్లో అదరగొట్టేసాడు

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రానున్న ఈ సినిమాకి ఆదికేశవ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన టీజర్ ను కూడా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ మాస్ లుక్ లో అదరగొట్టాడు.

రుద్రకాళేశ్వర్ రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న వైష్ణవ్.. గ్రానైట్ క్వారీలో ఉన్న ఒక శివాలయం కూల్చడానికి ప్రయత్నించే విలన్స్ ను అడ్డుకుంటున్నట్టుగా కనిపించాడు. ఇక మొత్తంగా చూస్తే.. ఈ మూవీతో సాలిడ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు వైష్ణవ్. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాని శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తుండగా.. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వైష్ణవ్ కెరీర్ లో నాల్గవ సినిమాగా రానున్న ఈ మూవీ.. 2023 జులై లో ప్రేక్షకుల ముందుకు రానుంది.