
బేబీ(Baby) సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఈ సినిమాలో ఆమె పాత్రకు, ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. నార్మల్ ఆడియన్స్ నుండి స్టార్స్ వరకు వైష్ణవి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ రేంజ్ తన నటనతో ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకుంది వైష్ణవి. నిజం చెప్పాలంటే బేబీ సినిమాను తన భుజాలపై మోసింది వైష్ణవి.
అయితే తాజాగా వైష్ణవి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. బలగం(Balagam) సినిమా కోసం ముందుగా వైష్ణవి ని అప్ప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ ఈ సినిమాను చేసేందుకు నిరాకరించిందట వైష్ణవి. కారణం.. బలగం కథ బాగున్నా అందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడమేనట. తనని తాను నిరూపించుకోవడానికి బలగం సినిమా కరక్ట్ కాదని ఫీల్ అయిందట వైష్ణవి. అందుకే ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకోలేదట. తరువాత ఆ పాత్ర కోసం మరో యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్(Kavya kalyanram) ను తీసుకున్నారు బలగం టీమ్.
ఇక ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ కూడా వైష్ణవి తీసుకున్న నిర్ణయం కరక్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బలగం సినిమా చేసుంటే వైష్ణవికి ఇంత క్రేజ్ వచ్చి ఉండేది కాదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక బేబీ సినిమా సక్సెస్ తో వైష్ణవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయట. అందులో గీత ఆర్ట్స్(Geetha arts) బ్యానర్ నుండి కూడా ఒక భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం.