వకీల్ సాబ్2 కాదు కొత్త కథ.. ఇదేం ట్విస్టు!

వకీల్ సాబ్2 కాదు కొత్త కథ.. ఇదేం ట్విస్టు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) రీ ఎంట్రీలో వకీల్ సా(Vakeel saab)బ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్(Venu Sriram) తన తరువాత సినిమాను పట్టాలెక్కించి పనిలో పడ్డాడు. అందుకోసం యూత్ స్టార్ నితిన్(Nithin) ను సెలెక్ట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. దిల్ రాజు(Dil raju) నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. మాస్ అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుందట. 

అయితే ఈ న్యూస్ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే.. ఆమధ్య దర్శకుడు వేణు శ్రీరామ్ తన తరువాతి సినిమా కోసం కథ ప్రిపేర్ చేస్తున్నానని, అది కూడా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్2 అని ప్రకటించారు. ఇక అప్పటినుండి పవన్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న న్యూస్ తో వాల్ల ఆశలపై నీళ్లు ఛాల్లినట్టైంది. 

ఇక వేణు శ్రీరామ్ కూడా పవన్ తో సినిమా కోసం చాలా ట్రై చేశారట. కానీ పస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్ వేరే సినిమా చేసేందుకు సిద్దమయ్యాడట. అందులో భాగంగానే నితిన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్టు కోసం నితిన్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యేలా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను సెట్ చేశాడట వేణు. అయితే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.