
- ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మక్తల్ గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్, డిగ్రీ పాలమూరులో చదివారు.
- 2000లో శ్రీహరికి లలితతో వివాహమైంది. ఆమె ఎంఏ, బీఈడీ చదివారు. భర్త సహకారంతో లలిత కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
- వాకిటి శ్రీహరి 1990 – 93 వరకు మక్తల్ మండల ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
- 1993–96 వరకు మక్తల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్
- 1996–2001 వరకు మక్తల్ మండల పార్టీ సెక్రటరీ
- 2001–06 వరకు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్
- 2001–06 వరకు మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి అత్యధిక మెజారిటీతో మొదటి సారిగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
- 2014లో జడ్పీటీసీగా గెలిచారు. 2018 వరకు జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.
- 2022 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్‌గా చేశారు.
- 2023లో మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి చిట్టెం రాంమోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
పూర్తి పేరు: వాకిటి శ్రీహరి
పుట్టిన తేదీ : 01.11.1972
తల్లిదండ్రులు : నర్సింహులు, రాములమ్మ
సామాజిక వర్గం: ముదిరాజ్ (బీసీ)
విద్యార్హత: బీఏ, భార్య : లలిత
పిల్లలు: అచ్యుత్రాజ్(ఎంబీఏ), అమిత్ రాజ్ (బీబీఏ)