సంక్రాంతికే వాల్తేరు వీరయ్య రిలీజ్

 సంక్రాంతికే వాల్తేరు వీరయ్య రిలీజ్

‘బాస్‌‌‌‌ పార్టీ’ అంటూ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో ఇంప్రెస్‌‌‌‌ చేస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’.. సినిమా రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అంటూ ఇప్పటికే చెప్పారు. కానీ విడుదల ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. బుధవారం రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను కూడా అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్‌‌‌‌ చేశారు. జనవరి 13న గ్రాండ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో లుంగీ, కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ షర్ట్, హెడ్ బ్యాండ్‌‌‌‌తో వింటేజ్‌‌‌‌ మాస్‌‌‌‌ అవతార్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్నారు చిరంజీవి. చేతిలో ఆయుధం పట్టుకుని సముద్రం మధ్య వర్షంలో పడవ నడుపుతూ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించారు.  

మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌‌‌‌ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌ జరుగుతున్నాయి. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్‌‌‌‌ నటిస్తోంది. ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మాస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి పండుగకు థియేటర్స్‌‌‌‌లో మాస్‌‌‌‌ పార్టీని అందించడానికి మరొక బ్లాక్‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌ లోడ్ అవుతోంది అని చెబుతున్నారు మేకర్స్. మరోవైపు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ చిత్రాలు జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి సినిమా కూడా రిలీజ్ డేట్ కన్‌‌‌‌ఫర్మ్ అవడంతో.. ముగ్గురిలో సంక్రాంతి విజేత ఎవరనే ఆసక్తి నెలకొంది.