‘వనజీవి జీవితం’ పుస్తకావిష్కరణ

‘వనజీవి జీవితం’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: జిల్లా నరేశ్​రాసిన ‘విత్తనం నుంచి మహావృక్షంగా.. వనజీవి జీవితం’ పుస్తకాన్ని శనివారం రచయిత పసునూరి రవీందర్ అధ్యక్షతన రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కవులు, గాయకులు గోరటి వెంకన్న, జయరాజు హాజరయ్యారు.

తత్వవేత్తలు ప్రకృతి నుంచే జ్ఞానాన్ని సంపాదించారని గోరటి వెంకన్న అన్నారు. జయరాజు మాట్లాడుతూ.. ఇరవై ఏండ్ల కిందటే తాను క్యాన్సర్ నుంచి బయటపడ్డానని, అందుకు కారణం ప్రకృతితో మమేకమై జీవించడమేనని చెప్పారు. కార్యక్రమంలో సినీ దర్శకులు వేణు ఊడుగుల, యాకూబ్, వట ఫౌండేషన్ ఉదయ్ కృష్ణ, తెలంగాణ బుక్ ట్రస్ట్ నిర్వాహకులు  చంద్రమోహన్  పాల్గొన్నారు.