వనమా రాఘవకు బెయిల్ మంజూరు

వనమా రాఘవకు బెయిల్ మంజూరు

హైదరాబాద్: వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవకు హైకోర్టులో ఊరట లభించింది. వనమా రాఘవకు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ 61 రోజులు జైల్లో ఉన్నాడు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్ట్..రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని షరతు విధించిన హైకోర్టు..ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని షరతు విధించింది.

పాల్వంచ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన విష‌యం తెల్సిందే. నాగ రామ‌కృష్ణ కుటుంబాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ బెదింరిచార‌ని, వేధింపుల‌కు గురి చేశార‌ని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దీంతో వ‌న‌మా రాఘ‌వ ను పోలీసులు ఎనిమిది బృందాలతో గాలించి చివ‌రికి అరెస్టు చేశారు. అలాగే రామ‌కృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రామకృష్ణ త‌ల్లి, సోద‌రి కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు.