వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో రోగుల అవస్థలు... ఓపీ కోసం గంటల తరబడి క్యూ

వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో రోగుల అవస్థలు... ఓపీ కోసం గంటల తరబడి క్యూ

హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఓపీ కోసం భారీ ఎత్తున రోగులు క్యూ కట్టారు. సీజనల్ వ్యాధులతో వచ్చిన రోగులతో పాటు జనరల్ చెక్ అప్ కోసం వచ్చిన గర్భిణీలు కూడా అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి  గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నామని..ఇప్పటి వరకు కూడా  డాక్టర్లు చూడటం లేదని రోగులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు  ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ సర్వర్ లో సమస్య రావడంతో టెస్ట్ ల సేవలన్నీ నిలిచిపోయాయి. ఒక్క టెస్ట్ చేయించుకోవాలంటే రెండు రోజులు వెయిట్ చేయాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. ఓపీ కోసం కొత్తగా ఆధార్ బయోమెట్రిక్ పెట్టడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయమని పేషెంట్లు అంటున్నారు. ఆధార్ లేకపోతే ఓపీ ఇవ్వమని ఆసుపత్రి సిబ్బంది తమను వెనక్కి పంపుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చిన వారంతా రోజుల తరబడి ఓపీ కోసమే నిరీక్షించాల్సి వస్తోందంటున్నారు. మరోవైపు ఆసుపత్రిలో కరెంట్ కూడా సరిగా ఉండదని..దీని వల్ల పలు రకాల టెస్టులకు ఆటంకం కలుగుతోందంటున్నారు.