
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్– విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ సోమవారం 4 గంటలు ఆలస్యంగా నడవనున్నదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ రైలు ప్రతి రోజు సికింద్రాబాద్లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. పలు సాంకేతిక కారణాల వల్ల సోమవారం ఉదయం 5.05గంటలకు బదులుగా ఉదయం 9.05గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు చెప్పారు.